కాంగ్రెస్‌కు నా అవసరం కన్నా… : ప్రశాంత్‌ కిశోర్‌

 పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్‌ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించిన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తను తీసుకున్న నిర్ణయం పట్ల స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు ఓ సూచన చేశారు. ‘ సాధికారిత కమిటీలో భాగంగా పార్టీలో చేరాలని, 2024 పార్లమెంట్‌ ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించాను. నా అభిప్రాయం ప్రకారం.. కాంగ్రెస్‌లో లోతుగా పాతుకుపోయిన నిర్మాణపరమైన సమస్యలను పరిష్కరించడానికి నా అవసరం కన్నా.. పార్టీకి నాయకత్వం, సమిష్టి సంకల్పం అవసరం’ అని సూచించారు.