కీరవాణి కుమారుడు శ్రీసింహా రెండో సినిమా.. రాజమౌళి క్లాప్‌

‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మంచి పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీసింహా రెండో చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రం పూజా కార్యక్రమంలో పురాణపండ శ్రీనివాస్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, కీరవాణి స్క్రిఫ్ట్‌ని చిత్ర యూనిట్‌కు అందించారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి క్లాప్‌ కొట్టి శ్రీసింహా రెండో చిత్రాన్ని ప్రారంభించారు. వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో మణికాంత్‌ గెల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీసింహా సరసన చిత్రా శుక్లా, మిశ్రా నారంగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయి కొర్రపాటి ప్రొడక్షన్‌లో రజినీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మరో కుమారుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కాలభైరవ దూసుకుపోతున్నారు.