కేంద్రంపై విరుచుకుపడిన మాయావతి, లాలూ యాదవ్‌

మోడీ ప్రభుత్వంపై బిఎస్‌పి అధినేత మాయావతి, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు విరుచుకుపడ్డారు. మోడీ వాదనతో ఎన్నికల ప్రయోజనాల కోసం పాకులాడుతున్న కేంద్రం తీరు, ద్వంద్వ వైఖరి బయపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల ప్రాతిపదికన జనగణన సాధ్యం కాదంటూ కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడం తీవ్రమైనది, ఆలోచనాత్మకమైనదని అన్నారు. దీంతో ఒబిసిల రాజకీయ ప్రయోజనాలను, వాగ్దానాలను నెరవేర్చడంలో బిజెపి ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోందని మండిపడ్డారు. ఎస్‌సి, ఎస్‌టిల మాదిరిగానే.. ఒబిసిలు కూడా కుల ప్రాతిపదికన జనగణన చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారని, కేంద్రం తిరస్కరణ వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందని లాలూ మండిపడ్డారు.