కేంద్ర మంత్రి తో భేటీ అయిన కొడాలి నాని
కేంద్ర మంత్రి తో భేటీ అయిన కొడాలి నాని

కేంద్ర మంత్రి తో భేటీ అయిన కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్‌కు ఎఫ్‌సిఐ నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్లు బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. సోమవారం ఢిల్లీలో ఆయన కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం 92 లక్షల కార్డులను మాత్రమే గుర్తించిందని.. మొత్తం 1.30 కోట్ల కార్డులను గుర్తించాలని కేంద్రమంత్రిని కోరామని వెల్లడించారు.ఎఫ్‌సిఐ గోడౌన్‌లలో ధాన్యం నిల్వలను ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. ప్రస్తావించిన పలు సమస్యలపై కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ సానుకూలంగా స్పందించారని మంత్రి కొడాలి నాని వెల్లడించారు.