కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ

కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ

తెలంగాణలో కరోనా వరస్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. కరోనా విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టీకరించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు కరోనాపై ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త కరోనా వ్యతిరేక సేవకుడిగా సేవలందించాలని ఆయన పిలుపు ఇచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా దళారులపై చర్యలు చేపట్టాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.