కేసీఆర్‌ కరీనంగర్‌ పర్యటన వాయిదా
కేసీఆర్‌ కరీనంగర్‌ పర్యటన వాయిదా

కేసీఆర్‌ కరీనంగర్‌ పర్యటన వాయిదా

రాష్ట్ర ప్రజల్లో భరోసా నింపేందుకు సీఎం కేసీఆర్‌ శనివారం కరీంనగర్‌ వెళ్లాలనుకున్న పర్యటన వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ప్రబలుతున్న కోవిడ్‌పై ప్రజల్లో ధైర్యం నింపేందుకు కరీంనగర్‌ పర్యటనకు సీఎం సంకల్పించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పర్యటన వల్ల భారీగా జరుగుతున్న స్క్రీనింగ్, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలగకుండా ఉండాలని కరీంనగర్‌ జిల్లా యంత్రాంగం, వైద్య శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. దీంతో కేసీఆర్‌ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.