కేసీఆర్ కి కిషన్ రెడ్డి కౌంటర్

కేంద్ర ప్యాకేజీపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్‌ భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. మోదీ వెనుక దేశమంతా ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ సహా.. 50 అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయన్న సంగతి కేసీఆర్‌ తెలుసుకోవాలన్నారు. అడ్రస్‌ లేనివాళ్లు చెబితే ప్రధానిని విమర్శించడం కేసీఆర్‌కు తగదని చెప్పారు. కష్టకాలంలో ఓటు బ్యాంక్‌ రాజకీయాలు సరికాదన్నారు.