తెలంగాణలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకాన్ని ఎన్నికల పథకంగా మార్చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రైతు సమన్వయ సమితి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నారు. ఎప్పటి నుంచి రైతులకు మద్దతు ధరలు ప్రకటిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటి కీ ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన రైతు రుణమాఫీని అమలు చేయలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.

కేసీఆర్ కి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ