కేసీఆర్ పై మండిపడ్డ ఎంపీ బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. శనివారం ఆయన నాయకత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్‌ తమిళిసైని కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, అక్రమ సంపాదన కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని ప్యాకేజీలుగా విభజించి కొత్తగా టెండర్లను పిలిచారని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్లను పిలిచి సీఎం కేసీఆర్‌ దోచుకుంటున్నారని ఆరోపించారు. అలాగే, పాత ప్రాజెక్టులను కూడా కేసీఆర్‌ తన ఖాతాలో వేసుకుంటున్నారన్నారు