కోకా కోలా రూ. 100 కోట్ల సాయం

కరోనా వైరస్‌‌పై జరుగుతున్న పోరులో ప్రముఖ శీతలపానీయాల తయారీ సంస్థ కోకాకోలా కూడా ముందుకొచ్చింది. వంద కోట్ల రూపాయలను సాయంగా ప్రకటించింది. ఈ సొమ్మును ఆరోగ్య సంరక్షణ, పేదల సాయానికి వెచ్చించనున్నట్టు తెలిపింది. అంతేకాదు, 10 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో అవసరమైన పానీయాలను సరఫరా చేస్తామని ప్రకటించింది.