కోవిడ్-19 నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా విస్తరణ, పరీక్షల వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటివరకు 41,512 మందికి పరీక్షలు చేసినట్టుగా వెల్లడించారు. ప్రతి పదిలక్షల జనాభాకు 830 మందికి పరీక్షలు చేసి.. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 809 పరీక్షలతో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. ట్రూనాట్ పరీక్షల నమోదుకు ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 5,757 పరీక్షలు చేసినట్టు వివరించారు.

కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష