క్రిష్ 4 సినిమాలో విలన్ గా సౌత్ హీరో

బాలీవుడ్లో సూపర్ హీరో క్రేజ్ ను కలిగిన స్టార్ గా హృతిక్ రోషన్ కనిపిస్తాడు. సాహసోపేతమైన యాక్షన్ సినిమాలతో ఆయన యూత్ హృదయాలను కొల్లగొట్టేశాడు. కండలు తిరిగిన దేహంతో తెరపై ఆయన చేసే విన్యాసాలు చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహాన్ని చూపుతుంటారు. ఈ కారణంగానే క్రిష్ సిరీస్ లో ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

 త్వరలో క్రిష్ 4 కోసం ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలైనట్టుగా దర్శకుడు రాకేశ్ రోషన్ స్వయంగా చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయనీ, మొదటి మూడు భాగాల కంటే నాల్గొవ భాగాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దనున్నామని అన్నారు. ఈ సినిమాలో ప్రతినాయక పాత్రకి గాను సౌత్ నుంచి ఒక స్టార్ హీరోను తీసుకోనున్నామని చెప్పారు. ఆ సౌత్ స్టార్ హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారింది.