క్లోజ్‌ఫ్రెండ్ తో సమంత డెహ్రాడూన్‌ టూర్‌

సమంతా క్లోజ్‌ ఫ్రెండ్‌తో కలిసి డెహ్రాడూన్‌ టూర్‌ వెళ్లింది. ‘శాకుంతలం’ సినిమా షూటింగ్‌ తర్వాత నాగచైతన్యతో విడాకులు తీసుకోనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే… వీరి విడాకుల ప్రకటన అనంతరం… సోషల్‌మీడియాలో నాగచైతన్య కంటే సమంతనే ఎక్కువగా ట్రోల్‌ చేశారు. అంతేకాదు… ఆమె కెరీర్‌ డౌన్‌ అవుతుందని అనుమానాలూ వ్యక్తం చేశారు. అయితే నెటిజన్ల విమర్శలకు, అనుమానాలకు సామ్‌ ధీటుగానే స్పందించింది. తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆమె విజయదశమి రోజున ప్రకటించింది. తన వ్యక్తిత్వంపై చేస్తున్న విమర్శలకు సైతం ఘాటుగానే సమాధానం చెప్పింది. తాను కొత్తగా చేయబోయే సినిమా షూటింగ్‌లకు మరికొంత సమయం ఉండడంతో.. ఆ ఖాళీ సమయాన్ని తనకు ఇష్టమైనవారితోనూ… ఆప్తమిత్రులతోనూ గడుపుతోంది.