క‌రోనాకే వార్నింగ్ ఇచ్చిన రామ్‌గోపాల్‌ వర్మ

క‌రోనాకే వార్నింగ్ ఇచ్చిన రామ్‌గోపాల్‌ వర్మ

ఎప్పుడు కాంట్ర‌వ‌ర్సీస్‌తో వార్త‌ల‌లో నిలిచే రామ్ గోపాల్ వ‌ర్మ అప్పుడ‌ప్పుడు కాస్త ఫ‌న్నీ ట్వీట్స్ కూడా చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటాడు. తాజాగా ఆయ‌న క‌రోనా వైర‌స్‌కే వార్నింగ్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యాడు. వివ‌రాల‌లోకి వెళితే ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్‌తో కంటిపై కునుకు లేకుండా కాలం గడుపుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌నాల‌ని ఇంత‌గా భ‌య‌పెడుతున్న క‌రోనా.. మ‌మ్మ‌ల్ని చంపితే నువ్వు చ‌చ్చిపోతావు అన్న విష‌యాన్ని మ‌ర‌చిపోకు అని వ‌ర్మ .. కరోనాకే హెచ్చ‌రిక‌లు జారీ చేశాడు . డియ‌ర్ వైర‌స్‌, నువ్వు ఒక పారాసైట్ అనే విష‌యాన్ని మ‌ర‌చిపోయి అంద‌రిని చంపుకుంటూ వెళితే నువ్వు కూడా మాతో చ‌చ్చిపోతావు. నా మాట‌పై నీకు న‌మ్మ‌కం లేక‌పోతే వైరాలజీ క్రాష్‌ కోర్స్‌ తీసుకో.. అందుకే నా మాట విని నువ్వు బ్ర‌తుకు, మ‌మ్మ‌ల్ని బ్ర‌త‌క‌నివ్వు. నీకు కూడా జ్ఞానం ఉంటే బాగుండు అని నేను భావిస్తున్నాను అని వ‌ర్మ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు .