ఖమ్మం నగరంలో అభివృద్ధి పనులను సమీక్షించిన కేటీఆర్‌

ఖమ్మం మున్సిపాలిటీల పరిధలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పురపాలక, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు గురువారం మాసాబ్‌టాంక్‌లోని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా పలు అంవాలపై చర్చించారు. ఖమ్మం నగరంలో కొనసాగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నగరాభివృద్ధి కోసం చేపట్టిన చర్యల్ని నివేదిక ద్వారా మంత్రి కేటీఆర్‌కు మంత్రి పువ్డాడ వివరించారు. ఖమ్మం నగరంలో కొనసాగుతున్న మిషన్‌ భగీరధ పనుల వివరాలు చర్చకు వచ్చాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.