ఖాళీగా ఉండ‌టం ఇష్టం లేదు-కాజ‌ల్ అగ‌ర్వాల్‌

త‌న‌కు ఖాళీగా ఉండ‌టం ఇష్టం లేద‌ని అంటోంది అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో షూటింగ్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ సంద‌ర్భంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ స్పందిస్తూ ‘‘నాకు ఖాళీగా ఉండ‌టం ఇష్టం ఉండ‌దు. ఏదో ఒక విష‌యాన్ని నేర్చుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను. అది జీవితంలో నాకు ప‌నికొస్తుందా? లేదా అని ఆలోచించ‌ను. స‌మ‌యాన్ని వృథా చేయ‌డం కంటే ఏదో ఒక‌టి నేర్చుకోవ‌డం మంచిది క‌దా అనేది నా అభిప్రాయం. ప్ర‌స్తుతం నేను చెక్‌, మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాను. గ్యాప్ కూడా మంచిదే. మ‌న‌లో లోపాల‌ను స‌రి చేసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది’’ అన్నారు.