ఖుష్బూకు తప్పిన ప్రమాదం

సినీ నటి, బిజెపి నాయకురాలు ఖుష్బూకు ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారరును ట్యాంకర్‌ ఢీకొీట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్‌బెలూన్స్‌ తెరుచుకోవడంతో ఆమె సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయం గురించి తెలుపుతూ ఖుష్బూ స్వయంగా ఓ ట్వీట్‌ చేశారు. ‘కడలూరు వెళ్తుండగా మార్గమధ్యంలో మెల్మర్వతూర్‌ వద్ద మేం ప్రయాణిస్తున్న కారుని ట్యాంకర్‌ ఢీకొీట్టింది. అయితే ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవడం వల్ల సురక్షితంగా బయటపడ్డాం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.