భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 11,502 కేసులు నమోదు కాగా, 325మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,32,424కు చేరినట్లు సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటెన్‌లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మరణాల సంఖ్య 9,520కి చేరింది. 1,53,106 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 1,69,798 మంది కోలుకున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. రికవరీ రేటు 50.59 శాతంగా ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీల్లో వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
