గవర్నర్‌తో ముగిసిన నిమ్మగడ్డ భేటీ..

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కమార్‌ భేటీ ముగిసింది. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో సుమారు 45 నిమిషాల పాటు గవర్నర్‌తో నిమ్మగడ్డ చర్చలు జరిపారు. ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత, ఎన్నికలపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ వైఖరిపై రమేష్‌కుమార్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఎపిలో కరోనా పేరుతో ఎన్నికలను అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చర్చలు ముగిసిన అనంతరం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నేరుగా తన కార్యాలయానికి వెళ్లారు. ఈరోజు సాయంత్రం జిల్లా అధికారులతో కలిసి ఎస్‌ఇసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.