గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ
గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసకుంటున్న చర్యలను, లాక్‌డౌన్‌ పరిస్థితులను సీఎం జగన్‌ ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. కరోనా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గవర్నర్‌ కార్యాలయంలోకి వెళ్లే ముందు సీఎం వైఎస్‌ జగన్‌ శానిటైజర్‌తో తన చేతులను శుభ్రం చేసుకున్నారు. అలాగే సమావేశంలో కూడా గవర్నర్‌, సీఎం జగన్‌లు సామాజిక దూరం పాటించారు.