గవర్నర్ తో భేటీ అయిన ఉత్తమ్
గవర్నర్ తో భేటీ అయిన ఉత్తమ్

గవర్నర్ తో భేటీ అయిన ఉత్తమ్

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సోమవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. లాక్‌డౌన్‌లో రైతుల సమస్యలు, కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వ నిర్లక్క్ష్యంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్‌ కుమార్‌ గవర్నర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ నేతలుతో కలిసి గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. ఆకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే వలస కూలీల విషయంలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునేలా ఆదేశించాలని లేఖలో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలను ఆదుకోవాలని లేఖ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఆర్థికంగా చితికిపోయిన పేదలను ఆదుకోవాలని కోరింది