గాన గంధర్వుడికి కన్నీటి వీడ్కోలు.. బాలు అంత్యక్రియలు పూర్తి

అశ్రు నయనాల మధ్య గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నై శివారులోని ఫామ్‌ హౌస్‌లో అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు అశ్రు నివాళులు అర్పించారు. బాలును కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు వెళ్లారు. తమ అభిమాన గాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఎపి ప్రభుత్వం తరపున మంత్రి అనిల్‌ యాదవ్‌ హాజరై నివాళులు అర్పించారు. సినీ రంగం నుంచి విజరు, భారతీరాజా, దేవీశ్రీప్రసాద్‌, మనో, తదితరులు హాజరయ్యారు.