గుంటూరులో ‘మహిళా పార్లమెంట్’ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వేలాదిమంది మహిళా ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ చైర్మన్ లతో జరగనున్న ‘గొప్ప స్ఫూర్తి సభ’ కు విజయవాడ వేదిక కానుంది. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ సభ నిర్వహణ నిమిత్తం బుధవారం రాష్ట్ర మంత్రులు శ్రీమతి తానేటి వనిత గారు, శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, మేయర్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీలు శ్రీ తలశిల రఘురాం గారు, శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు, మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శ్రీమతి అనూరాధ గారు ఇతర అధికారులు స్టేడియం స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు.