గుజరాత్‌ సీఎంకు సీఎం జగన్ ఫోన్
గుజరాత్‌ సీఎంకు సీఎం జగన్ ఫోన్

గుజరాత్‌ సీఎంకు సీఎం జగన్ ఫోన్

గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ చేశారు. గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాని ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. గుజరాత్‌ సీఎంకు విజ్ఞప్తి చేశారు. వారికి వసతి, భోజన సదుపాయం కల్పించాలని కోరారు. సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తిపై గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీ సానుకూలంగా స్పందించారు. తెలుగువారిని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.