గోకుల్‌చాట్‌ యజమానికి కరోనా

హైదరాబాద్‌లో పేరుపొందిన కోఠి గోకుల్‌చాట్‌ యజమాని (72)కి కరోనా పాజిటివ్‌ రావడం కలకలం సృష్టించింది. అధికారులు గోకుల్‌చాట్‌ను మూసివేయించడంతో పాటు 20 మంది సిబ్బందిని, కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. కరోనా పా జిటివ్‌ వచ్చిన యజమాని ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారో వైద్య సిబ్బంది, పో లీసులు వివరాలు సేకరిస్తున్నారు. సాధారణంగా ఎక్కువ సంఖ్యలోనే ప్రజలు గోకుల్‌చాట్‌ రుచులను ఆస్వాదిస్తుం టారు. దీంతో ఎక్కువ మంది వివరా లు సేకరించాల్సి రావొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

గోకుల్‌చాట్‌లో కట్లెట్, పావుబాజి, కుల్ఫీ వంటి పదార్థాలను ఎక్కువ మంది రుచిచూస్తారు. లాక్‌డౌన్‌తో మూతపడిన దుకాణం ప్ర భుత్వం సడలింపులు ఇవ్వడంతో తెరుచుకుంది. టేక్‌ అవే పేరుతో కట్లెట్, ఇతర స్నాక్స్‌ అందిస్తోంది. గోకుల్‌చాట్‌ యజ మానికి పాజిటివ్‌ రావడంతో ఇక్కడ స్నా క్స్‌ తిన్న వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ దుకాణంలో 40 మంది వరకు పనిచేసేవారు. కేంద్రం సడలింపులతో వారిలో చాలామంది సొంతూళ్లకు వెళ్లారు. ప్రస్తుతం సగం మందే విధులు నిర్వహిస్తున్నారు. వీరందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.