గ్రామ వాలంటీర్లకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ వర్తింపు
గ్రామ వాలంటీర్లకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ వర్తింపు

గ్రామ వాలంటీర్లకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ వర్తింపు

పంచాయతీ రాజ్ శాఖకు వైద్య ఆరోగ్య శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఇకపై గ్రామ, వార్డు వలంటీర్లకూ ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ‘ ప్యాకేజీ వర్తించనుంది. పీఎంజీకే ప్యాకేజీ కింద రూ. 50 లక్షల బీమా వర్తించనుంది. రాష్ట్రంలో 2,60,000 మంది గ్రామ, వార్డు వలంటీర్లున్నారు. మూడు విడతల కొవిడ్-19 ఇంటింటి సర్వేలో వలంటీర్లు పాల్గొన్నారు. కొవిడ్-19 పాజిటివ్ పేషంట్లతో కాంటాక్ట్ అయ్యే అవకాశమున్నందున వీరికి కూడా బీమా పథకం వర్తింప జేస్తూ వైద్య ఆరోగ్యశాఖ సర్క్యులర్ జారీ చేసింది.