చంద్రబాబుపై హైకోర్టులో పిల్‌

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు భారీ కాన్వాయ్‌తో ప్రయాణించిన చంద్రబాబు.. మార్గమధ్యంలో పలుచోట్ల జనసమీకరణ, బైక్‌ ర్యాలీలతో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. రాజకీయ ర్యాలీలపై నిషేధం ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఆ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. కరోనా వ్యాప్తి జరిగేలా చంద్రబాబు వ్యవహరించాడని పిటిషన్‌లో పేర్కొన్నారు. బాబుకు ఇచ్చిన అనుమతిని రద్దుచేసి, ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.