చంద్రబాబు కి సవాల్ విసిరిన శ్రీకాంత్ రెడ్డి
చంద్రబాబు కి సవాల్ విసిరిన శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు కి సవాల్ విసిరిన శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు సవాల్‌ను స్వీకరించడానికి మా నాయకుడి వరకూ అవసరం లేదు. నేను గన్‌మెన్‌ లేకుండా వస్తా. ఎక్కడకు రావాలో చెప్పండి అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు లేకుండా రండి అని బాబు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని కొట్టిపారేశారు. ఆయన భద్రత కోసం ఉన్న బ్లాక్‌ కమాండోస్‌కు నెలకు రూ.60 ‍కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. వాళ్లు లేకుండా బాబు తుళ్లూరులోనే కాదు, రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ ఎక్కడా తిరగలేరని ఎద్దేవా చేశారు