చంద్రబాబు పై ధ్వజమెత్తిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి
చంద్రబాబు పై ధ్వజమెత్తిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

చంద్రబాబు పై ధ్వజమెత్తిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

రాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక విఫల నాయకుడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి విమర్శించారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఐదేళ్ల పాలనపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు. చంద్రబాబును భస్మాసురుడి పెద్దన్నగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేసే అర్హత ఆయనకు లేదని ధ్వజమెత్తారు.
చంద్రబాబు చేస్తున్న చైతన్య యాత్రలు జనాలు లేక వెలవెల బోతున్నాయని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి నాలుగు మంచి సలహాలు చెప్పారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి.. ఎన్నికల వాయిదా వేయించేందుకు ఆయన సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు.