చంద్రబాబు పై ధ్వజమెత్తిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్
చంద్రబాబు పై ధ్వజమెత్తిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

చంద్రబాబు పై ధ్వజమెత్తిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

ప్రతిపక్షనేత చంద్రబాబుపై రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా క్లిష్ట సమయంలో చంద్రబాబు నీచ, నికృష్ట రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయనలాంటి ప్రతిపక్షనేత ఉండటం దురదృష్టకరం అన్నారు. కరోనా కట్టడి చర్యల్లో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌ మెరుగ్గా ఉందన్నారు. దేశంలో కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. మొత్తం టెస్టుల్లో దేశవ్యాప్తంగా 4.5 కేసులు నమోదవుతోంటే.. ఏపీలో అతి తక్కువగా 1.5 శాతం కరోనా కేసులు నమోదవుతున్నాయని మంత్రి వెల్లడించారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా బాధితుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. చంద్రబాబు మంచి చేయకపోయినా పర్లేదు కానీ ప్రజలను భయపెట్టొద్దు. కర్నూలు ఎంపీ ఇంట్లో నలుగురు డాక్టర్లకు పాజిటివ్ వస్తే చంద్రబాబు హేళన చేస్తున్నారు. వారు డాక్టర్లు, ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు. అటువంటి వారిని అభినదించాలి. వారిని కించ పరచడం సరికాదు. చంద్రబాబు మౌత్ పీస్ కన్నా లక్ష్మీనారాయణ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్టు కిట్లపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా విమర్శలు చేయడంలో అర్ధం లేదు.