చంద్రబాబు పై పంచులు వేసిన విజయసాయి రెడ్డి
చంద్రబాబు పై పంచులు వేసిన విజయసాయి రెడ్డి

చంద్రబాబు పై పంచులు వేసిన విజయసాయిరెడ్డి

నమ్మిన వాళ్లను తొక్కేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని ట్విటర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదని తెలిపారు. ‘మోపిదేవి, బోస్‌ల పార్టీ విధేయతను గుర్తించి.. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ స్థాయిలో గౌరవిస్తున్నారో చూస్తున్నావు కదా. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎందరికి టికెట్లిచ్చావు? అదే చంద్రబాబుకు, జగన్‌కు ఉన్న తేడా’ అని ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి పోస్ట్‌ చేశారు.

టీడీపీలో చంద్రబాబు ఎప్పుడూ తన వాళ్లకే పెద్దపీట వేశాడు. బలివ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం దళితులు, బీసీలు గుర్తుకొస్తారు. మోత్కుపల్లి, పుష్పరాజ్, అనంతయ్య నుంచి వర్ల రామయ్య వరకు అదే తంతు. గెలిచే ఛాన్స్ దగ్గర తన వాళ్లు, ఓడే ప్రమాదం ఉన్న దగ్గర దళితులు!’ అని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు.