చంద్రబాబు పై ఫైర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రబాబు పై ఫైర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చంద్రబాబు పై ఫైర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అభ్యర్థులు దొరక్క టీడీపీ అధినేత చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోయే స్థానానికి ఎస్సీని బలిచేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ ప్రభుత్వం 90శాతం హామీలు పూర్తి చేసిందని ఆయన తెలిపారు. గవర్నర్‌కి చంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు చూస్తే.. ఆయనంత గొప్ప నటుడు లేడు అనిపిస్తోందని తప్పుబట్టారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు, ప్రధాని మోదీని తిట్టి ఇప్పుడు కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి ఎద్దేవాచేశారు.