చంద్రబాబు పై బొత్స ఆగ్రహం
చంద్రబాబు పై బొత్స ఆగ్రహం

చంద్రబాబు పై బొత్స ఆగ్రహం

టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బడుగు వర్గాల ద్రోహి అని రాష్ట్ర మున్సిపల్, పట్ణణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జనాభా ప్రతిపాదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారని విమర్శించారు. ఆయన సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. బడుగులకు 59 శాతం రిజర్వేషన్‌ ఇస్తే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని నిలదీశారు. బడుగుల మేలు కోసం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి బాబు అడ్డుతగులుతున్నారని ధ్వజమెత్తారు. బలహీనవర్గాలు టీడీపీని ఎప్పటికీ క్షమించవన్నారు.