చంద్రబాబు పై మండిపడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రబాబు పై మండిపడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చంద్రబాబు పై మండిపడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని తెలిసే చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ చిత్తూరు జిల్లాలో బాబు మెజారిటీ సీట్లు గెలవలేకపోయారు. సతీష్‌రెడ్డి , డొక్కా మాణిక్యవరప్రసాద్‌, రెహమాన్ టీడీపీకి ఎందుకు రాజీనామా చేశారో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సతీష్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలి.