చంద్రబాబు పై మండిపడ్డ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

పేదలకు ఇళ్ల స్థలాలపై చంద్రబాబుది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్‌ హయంలో 21లక్షల ఇళ్లు నిర్మించారని, ఐదేళ్లలో 30లక్షల ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. చంద్రబాబు హయాంలో కేవలం 6.8లక్షల ఇళ్లు కట్టారని, చంద్రబాబు హయాంలో గ్రాఫిక్స్‌లో ఇళ్లు కట్టారని ఎద్దేవాచేశారు. గత ఐదేళ్లలో చంద్రన్న ఫిల్మ్‌ నడిచిందన్నారు. అసత్యాలు చెబుతూ ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడిలేని ట్విట్టర్‌ ఉందికదా అని తప్పడు సమాచారం ఇవ్వొద్దని, టీడీపీ నేత లోకేష్‌ తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారని రాజేంద్రనాథ్‌రెడ్డి తప్పుబట్టారు.