చంద్రబాబు పై మండిపడ్డ రోజా
చంద్రబాబు పై మండిపడ్డ రోజా

చంద్రబాబు పై మండిపడ్డ రోజా

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలలో చైతన్యం కల్పించాలి అంటూ బస్సు యాత్ర చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్‌ చేసిన మోసాలకు ఏపీ ప్రజలు వారిని మూలనపడేశారన్నారు. ఎంతసేపు 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు బాబు కానీ.. ఆయన చేసిన పాపాలను ఆ దేవుడు కూడా క్షమించడు అని విమర్శించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించిన బాబు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని రాయసీమ, ఉత్తరాంధ్రలో పర్యటిస్తారని మండిపడ్డారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా ద్వారా 55 లక్షల మందికి, అమ్మఒడి ద్వారా 40 లక్షల మందికి, పెన్షన్‌ ద్వారా 54 లక్షల మందికి అబ్ది చేకూర్చారని తెలిపారు. అదే విధంగా ఇంకా అనేక పథకాల ద్వారా సీఎం జగన్‌ కోట్ల మంది ప్రజలకు లబ్ది చేకుర్చారన్నారు.