చంద్రబాబు పై మండిపడ్డ విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమం‍త్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో సుపరిపాలన జరుగుతోందని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఏపీ ప్రతిపక్ష నాయకుడా, లేక తెలంగాణ ప్రతిపక్ష నాయకుడా అని ఎద్దేవా చేశారు.కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందిపడుతుంటే, చంద్రబాబు రాజకీయాలు చేయడం దురదృష్టకరమని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో కరోనా కేసులు దాచవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కరోనా కేసులపై ఆదివారం పూర్తి వివరాలు అందజేస్తామన్నారు. చంద్రబాబు రాష్ట్ర ఖజనా ఖాళీ చేసి ఆస్తులు విదేశాల్లో దాచుకున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇంట్లో నుండి బయటకు వచ్చి మాట్లాడాలని, ముందు మీరు రాష్ట్రానికి వచ్చి ప్రజా సేవ చేయాలని సూచించారు.