చంద్రబాబు పై మండిపడ్డ విజయసాయి రెడ్డి
చంద్రబాబు పై మండిపడ్డ విజయసాయి రెడ్డి

చంద్రబాబు పై మండిపడ్డ విజయసాయి రెడ్డి

చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎంతకైనా దిగజారతాడని విమర్శించారు. పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు చంద్రబాబు కులాలు అంటగడుతున్నారని మండిపడ్డారు. వారిపై అధికార పార్టీ సానుభూతిపరులనే ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ప్రజలు నమ్ముతారని చంద్రబాబు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. అఖరున ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదని చంద్రబాబు శోకాలు పెడతారని వ్యాఖ్యానించారు.