చంద్రబాబు పై రెచ్చిపోయిన సజ్జల రామకృష్ణారెడ్డి
చంద్రబాబు పై రెచ్చిపోయిన సజ్జల రామకృష్ణారెడ్డి

చంద్రబాబు పై రెచ్చిపోయిన సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు నాయుడులో మార్పు రాలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించారన్నారు. చంద్రబాబు కరుడుగట్టిన మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై లెక్కలేని తనంతో ఆయన వ్యవహార శైలి ఉంది. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబులో మార్పు రాలేదు. కేసులకు భయపడి రాత్రికి రాత్రే హైదరాబాద్‌ విడిచి పారిపోయి వచ్చేశారు. చంద్రబాబు తుగ్లక్‌గా ప్రజలే తీర్పు ఇచ్చారు. ప్రజల్లో నమ్మకం కల్పించుకుంటే ఆయనను ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు. ఏదో ఒక సాకుతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే లెక్కలేకుండా పోయింది. రాజధాని ఏర్పాటు విషయంలో కూడా చంద్రబాబు అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు చెప్పే క్యాపిటల్‌ ప్రాంతంలోనే లోకేష్‌ను ప్రజలు తిరస్కరించారు. కియా పరిశ్రమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు బతుకు అంతా మీడియా మేనేజ్‌మెంట్‌నే. కియా ఎందుకు పక్క రాష్ట్రానికి తరలిపోతుంది. అసత్య ప్రచారం చేస్తే న్యాయపరంగా ముందుకు వెళతాం అని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.