చంద్రబాబు పై రెచ్చి పోయిన విజయసాయి రెడ్డి
చంద్రబాబు పై రెచ్చి పోయిన విజయసాయి రెడ్డి

చంద్రబాబు పై రెచ్చి పోయిన విజయసాయి రెడ్డి

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు పీఏపై ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్ల బాగోతం బయటపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్ధేశించి ఎంపీ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడింది. బినామీలు, పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలను జల్లెడ పడితే పది లక్షల కోట్లయినా దొరుకుతాయి. బాబు నెట్ వర్క్ను చూసి ముంబాయి కార్పోరేట్ సంస్థలన్నీ బిత్తర పోయాయట. ఇప్పడు బయటకొచ్చింది ఉల్లిపాయపై పొర మాత్రమే.’’ అంటూ ట్వీట్‌ చేశారు.