ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’ కు రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు కూడా పునాదిరాళ్లు మొదటి సినిమా. తొలి సినిమాకే ఐదు నంది అవార్డులు దక్కాయి. రాజ్‌కుమార్ స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు. రాజ్‌కుమార్ .. 1977లో ‘పునాదిరాళ్లు’కు కథ రాసుకోగా, 1978లో ఈ సినిమాను తెరకెక్కించారు

చిరంజీవి తొలి సినిమా దర్శకుడు రాజ్ కుమార్ కన్నుమూత