చిరంజీవి, సల్మాన్‌ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ

చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. తమిళ డైరెక్టర్‌ మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, హీరోయిన్‌ నయనతార, హీరో సత్యదేవ్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మంగళవారం రంజాన్‌ పండుగ సందర్భంగా ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రబృందం అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌ కలిసి స్టెప్పులేయనున్న పాటకు ప్రముఖ హీరో, డాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవా కొరియోగ్రఫీ అందివ్వబోతున్నారని చిత్ర సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌.థమన్‌ ప్రకటించారు.