చదువు అనేది మనిషి చరిత్రను, కుటుంబ చరిత్రను, సామాజిక వర్గ చరిత్రను, రాష్ట్ర చరిత్రను, దేశ చరిత్రను మారుస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటిలోని తారక రామ స్టేడియంలో విద్యా దీవెన చివరి త్రైమాసికానికి సంబంధించిన నగదు జమ కార్యక్రమంలో పాల్గొని ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్క బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువు అనేది పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని అన్నారు. చదువును ఎవ్వరూ కూడా దొంగతనం చేయలేని అన్నారు. మన తలరాలను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉందన్నారు.
