జగన్‌ని కలిసిన తిరుపతి ఎంపి గురుమూర్తి

వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ని తిరుపతి ఎంపి డాక్టర్‌ గురుమూర్తి తాడేపల్లి సిఎం క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి గౌరవించారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ గురుమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. సిఎం చేతుల మీదుగా ఎంపి గురుమూర్తి డిక్లరేషన్‌ ఫారంను అందుకున్నారు. గురుమూర్తి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ సిఎం అభినందనలు తెలిపారు.