జగన్ కి లేఖ రాసిన సిపిఐ రామకృష్ణ
జగన్ కి లేఖ రాసిన సిపిఐ రామకృష్ణ

జగన్ కి లేఖ రాసిన సిపిఐ రామకృష్ణ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కరోనా విపత్తు వల్ల లాక్‌డౌన్ నేపథ్యంలో తొలగించిన కార్డు దారులకు కూడా రేషన్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ పంపిణీలో చౌకడిపోల వద్ద ప్రజలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయని తెలియజేశారు. వ్యక్తిగత దూరం పాటించకుండా వందల సంఖ్యలో రేషన్ దార్లు క్యూలైన్లో ఉంటున్నారని రామకృష్ణ పేర్కొన్నారు.