జగన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన జెసి
జగన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన జెసి

జగన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన జెసి

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి రమేష్‌కుమార్‌ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతో పాటూ కీలక అంశాలపై చర్చించారు. అనంతర మాట్లాడిన జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ చాలా తెలివైనవారని.. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ తగ్గిందని.. టీడీపీ అయినంత మాత్రాన అన్నీ విమర్శించాలని లేదన్నారు. ఎన్నికల ప్రక్రియను కుదించడం స్వాగతించ తగ్గ విషయమే అన్నారు.ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు మాజీ ఎంపీ చెప్పుకొచ్చారు. అందుకే రమేష్‌కుమార్‌ను కలిశానని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఎన్నికల సంఘం దగ్గర డబ్బులు లేకపోతే తమ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి.. ఇస్తామన్నారు. ఇక కోర్టులు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవని జేసీ వ్యాఖ్యానించారు.