ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేటి రాజమహేంద్రవరం పర్యటన వాయిదా పడింది. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్‌ను సీఎం నేడు ప్రారంభించాల్సి ఉంది. అలాగే, నన్నయ విశ్వవిద్యాలయంలో దిశ వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేశారు. ఇందుకోసం అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల జగన్ పర్యటన రేపటికి (శనివారం) వాయిదా పడినట్టు అధికారులు తెలిపారు.
