జనసేన అధినేత పవన్‌పై కొడాలి నాని ఫైర్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుడివాడ మండలం లింగవరంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ, రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని విరుచుకుపడ్డారు. ఏ అవగాహనతో పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అని నిలదీశారు. అంబేద్కర్‌ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించి జైలుకు పంపాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని అనుసరించి మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు రక్షణపై కంటే గొడవలు ఆపి, ఎవరిని గాయపరచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.