జయప్రదకు నాన్ బెయిలబుల్ వారంట్
జయప్రదకు నాన్ బెయిలబుల్ వారంట్

జయప్రదకు నాన్ బెయిలబుల్ వారంట్

ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు జయప్రదకు రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో జయప్రద బీజేపీ అభ్యర్థినిగా రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, సమాజ్‌వాదీపార్టీ అభ్యర్థి ఆజంఖాన్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో జయప్రద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పోలీసులు పెట్టిన కేసులో రాంపూర్ కోర్టు జయప్రదకు తాజాగా నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. జయప్రదపై నమోదైన మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ఉల్లంఘన కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 20వతేదీన జరగనుంది.