జాతినుద్దేసించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
జాతినుద్దేసించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

జాతినుద్దేసించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. కోవిడ్ -19 (కరోనా వైరస్) విస్తరిస్తున్న వైనం, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని జాతికి సందేశాన్ని ఇవ్వనున్నారు. కోవిడ్ -19కి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై మార్చి 24 (మంగళవారం) సాయంత్రం 8 గంటలకు ఆయన సందేశాన్ని ఇవ్వనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిపై ముఖ్యమైన విషయాలను పంచుకుంటాను అంటూ ప్రధాని మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు.

ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటనను సీరియస్ తీసుకోవడం లేదంటూ ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. అందరూ విధిగా లాక్ డౌన్ ఆంక్షలను, సూచనలను తీవ్రంగా పాటించాలని ఆయన ప్రజలను కోరారు, తద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడుకోవాలంటూ సోమవారం ట్విటర్ ద్వారా సూచించారు. అలాగే లాక్ డౌన్ ను కచ్చితంగా అమలయ్యే చూడాలని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.